డబ్బు, కండబలానికి కర్ణాటక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: కాంగ్రెస్ నేత చిదంబరం

  • నిర్ణయాత్మక తీర్పును వెలువరించారంటూ చిదంబరం ప్రశంసలు 
  • రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ అని వ్యాఖ్య
  • దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గం చూపించారని కన్నడ ప్రజలపై ప్రశంస
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచిందని పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. రాష్ట్ర ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.   

"నిర్ణయాత్మక తీర్పును వెలువరించినందుకు కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక అభినందనలు.. హృదయపూర్వక ధన్యవాదాలు" అని చిద్దూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికలు ఒక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ అన్నారు. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలను సమర్థించడం, అదే సమయంలో ఆధిపత్య సిద్ధాంతాలు, వివక్ష కారణంగా జరిగిన నష్టాన్ని నిలువరించడమే అన్నారు. 

కర్ణాటక ప్రజలు బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని పిలుచుకునే డబ్బు, కండబలానికి సరైన బుద్ధి చెప్పారని, ఇది దేశంలోని ఇతర ప్రాంతాలకు మంచి మార్గాన్ని చూపించిందన్నారు. మన అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక ఇప్పుడు ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచికలలో అగ్రస్థానంలో దూసుకుపోతుందని, వీర పోరాటం చేసి విజయం సాధించిన కె.పి.సి.సి. యోధులకు తన అభినందనలు అన్నారు. కాగా, రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 130కి పైగా స్థానాల్లో ఘన విజయం సాధించింది. 

Chidambaram
Congress

More Telugu News